కళ్ళు కన్నీళ్లని ప్రసవిస్తున్నాయి ప్రసవ వేదన తెలిసిన నీకై ఆర్ధిస్తున్నాయి నేలరాలిన కన్నీటి చుక్క ఆశల చెట్టుకు ఆయువునిస్తే అనుబంధాల కొమ్మల్ని బలవంతంగా నరుకుతున్నావు మోడుగా మారిన బంధాన్ని చూసి భోరు భోరున విలపిస్తుంటే వినపించని వేదన కనిపించని రోదనతో జతకట్టింది |
మనసుపడ్డ మనిషిని మరచిపోయిన మనస్తత్వాన్ని కొత్తగా పుట్టుకొచ్చిన మానవత్వం ఓడించింది మనసువిప్పి చెప్పు మనువుకి మనసుకి గతం చేదైతే మనుగడకూ , నిలకడకూ మతం మందవుతుందా |