చెలీ…….
నాకు వీడ్కోలు చెబుతున్నావా
నీవు వాస్తవంలోకి వెళుతున్నావా
కన్నీటితో చెబుతావనుకొన్నా
కఠిన మాటల బహుమతినిచావు
భారంగా వెళతావనుకొన్నా
బంధాన్ని తెంచుకెళ్ళావ్
బాధ్యతగా వుంటావనుకొన్నా
బాసలు చేసి మరచిపోయావు
అత్మీయతను పంచుతావనుకొన్నా
అవమానాన్ని పంపుతావనుకోలా
నీకు బాసటగా నిలుచున్నా
సమాజంలో దోషిగా నిలబడ్డా
నాకు వీడ్కోలు చెప్పి
ఆ సమాజాన్ని సంతోషపెట్టావు
నీమనసును మభ్యపెట్టావు
నాకన్నీటికి ఖరీదు కట్తావు