నేనేకావాలి ఆవేదన ఎంత వున్నా ఆలోచన నేనేకావాలి భయం ఎంత వున్నా భవిష్యత్ నేనేకావాలి మనసు గాయపడినా మానసిక బలం నేనే కావాలి నేటి స్వరం మార్చినా రేపటి సర్వస్వం నేనేకావాలి ఎన్ని బంధాలు విడివడినా అనుబంధం నేనే కావాలి అవమానాలెన్ని ఎదురైనా ఆత్మీయత నేనేకావాలి పలు కష్టాలెదురైనా చల్లని పలుకరింపు నేనేకావాలి |
అలసిన తనువుకు తీయని స్పర్శ నేనేకావాలి అదురుతున్న గుండెకు ఆదరువు నేనే కావాలి తన జీవనపోరాటంలో గెలుపు నేనేకావాలి తన మదిలో కదిలే తీయని భావన నేనేకావాలి బ్రతుకు బాటలో చివరి మజిలీ నేనేకావాలి చివరకు నీవు నాకు వద్దన్నా తనకోసం ఇచ్చే ఆత్మతర్పణం నేనేకావాలి |