అస్థిత్వం
కడలి అంచున రాస్తున్నవు
ఓ కెరటం తుడిపేస్తుంది
ఆరుబైట నివాసమా..
ఓ మేఘం వర్షిస్తుంది
మరచిపొయే ప్రయత్నమా ..
మనసు ప్రశ్నిస్తుంది
మార్పు కోసం ఆరాటమా ...
మనస్సాక్షి ఎదురు తిరుగుతుంది
అఙ్ఞానం గద్దెనెక్కితే
బంధం భారమౌతుంది
మనసు చేస్తుంది అరాచకత్వం
తుదకు అస్థిత్వం ప్రశ్నార్ధకం
పరిస్థితులు ప్రవర్తన మార్చినా
మనసు మార్చునా?
అద్త్వెత బంధమని ఆశపడి
నిలువెత్తు నిర్లక్ష్యానికి తాళి కడితే
ఇన్నాళ్ళ నిరీక్షణలో మిగిలింది
…………పరిహాసం ………పరితాపం