ప్రయాణం
మంగళ సూత్రానికి
మనసే ఆధారం
ఏడడుగుల బంధాన్ని
అడుగడునా అవమానపరిచినా
నాలుకపై తేనెని
హృదయంలో విషాన్ని చిమ్మినా
సహనం వహిస్తుంది
సర్వం క్షమిస్తుంది
నాడు భర్తతో చితిపై కాల్చబడిన
సతీ సహగమనానికి
నేడు భర్తచే వంటింట్లో కాల్చబడుతున్న
సతీ దహనానికి
పోలిక ఒక్కటే
అగ్ని సాక్షి తాళికి
అగ్గిపుల్లతో న్యాయం
తరాలు మారినా
మగాడు మారలేదనటానికి
ఇదే సాక్ష్యం
వరకట్నాన్ని
కన్యగా నిరసించి
తల్లిగా ద్వేషించి
అత్తగా ఆశిస్తుంటే
పాత్ర పాత్రకు మారుతున్న
నీ స్వభావ చంచలత్వం
మరలా రాతి యగానికి
ఈడ్వటానికి సహకరిస్తుంది
మమత పంచినా
మనసు విరిచినా
ఆదరించినా ..అణిచేసినా
సాధ్యం నీకే
స్తిరత్వం లేని మనసుతో
నీవు చేస్తున్న ప్రయాణం
ఒక సమస్య నుండి
మరొక సమస్య వరకు
మాత్రమే సుమా!