గుర్తుంచుకో నేస్తం
నీ ఒంటరితనపు
ఏకాంతంలో నేనున్నా
అమ్మా అని పిలిచే
నీచిన్నారి పిలుపులో నేనున్నా
కన్నీరొస్తే తుడిచే
నీ వేలి కొనల్లో నేనున్నా
కష్టమొస్తే తలిచే
మొదటిమనిషిగా నేనున్నా
శ్రమచేసినవేళ
నీ చెమట బొట్టునై నేనున్నా
అలసి వచ్చిన వేళ
సేదదీర్చే చలువనీడనై నేనున్నా
తొలకరి జల్లులకి తడిచిన
మట్టివాసన పరిమళంలా
ఉదయసంధ్య చిరుగాలి చల్లదనంలా
ఉషోదయ కిరణాల
నులి వెచ్చదనంలా
నీజీవన దినచర్యలో
నిత్యం నీతోనే వుంటాను
నీలోనే వుంటాను
గుర్తుంచుకో నేస్తం
నీ ఆవేదనలో
ఆత్మబంధువునై నేనున్నా
నీవు మనసుతో ఆలోచిస్తే
నీ అంతరాత్మనై నేనున్నా
నీ ఒంటరితనపు
ఏకాంతంలో నేనున్నా
అమ్మా అని పిలిచే
నీచిన్నారి పిలుపులో నేనున్నా
కన్నీరొస్తే తుడిచే
నీ వేలి కొనల్లో నేనున్నా
కష్టమొస్తే తలిచే
మొదటిమనిషిగా నేనున్నా
శ్రమచేసినవేళ
నీ చెమట బొట్టునై నేనున్నా
అలసి వచ్చిన వేళ
సేదదీర్చే చలువనీడనై నేనున్నా
తొలకరి జల్లులకి తడిచిన
మట్టివాసన పరిమళంలా
ఉదయసంధ్య చిరుగాలి చల్లదనంలా
ఉషోదయ కిరణాల
నులి వెచ్చదనంలా
నీజీవన దినచర్యలో
నిత్యం నీతోనే వుంటాను
నీలోనే వుంటాను
గుర్తుంచుకో నేస్తం
నీ ఆవేదనలో
ఆత్మబంధువునై నేనున్నా
నీవు మనసుతో ఆలోచిస్తే
నీ అంతరాత్మనై నేనున్నా