ఎడబాటు
గడియల ఎడబాటు
గుండెను బాధిస్తుంది
అలసిన మనసు
మౌనంగా రోధిస్తుంది
నీ స్వరం వినటం కోసం
ఇక్కడ సర్వం మరచి ఎదురుచూస్తున్నా
నీవు సౌఖ్యమా ప్రియతమా
అని అడగలేని దీనస్థితి
బాధలో వున్నావో
బాధ్యతల నడుమ వున్నావో
ఊహించలేని ,
పలుకరించలేని దుస్థితి
నేస్తమా .....
నేను ఇక్కడ కుశలమని…..
ఓసారి చెప్పలేవా
నీ నోటినుండి
ఆ మాట వినరాక
ఇక్కడ ఓ జీవి
జీవచ్ఛవంలా కదులుతుంది
పంజరంలో నీవున్నా
నీ మనసు
నన్ను పలువరిస్తూనే ఉంటుందన్న ఆశ
నాకు ప్రాణ వాయువై నిలొస్తుంది
నీవు పిలిచే సమయంకోసం ఎదురుచూస్తూ
భారంగా...
ఈ గుండె బరువును మోస్తూ,,,,