గాలిపటం
నేస్తమా
మన బంధం
పటిష్టమైనదే అనుకున్నా
కానీ ఎలా నిలుస్తుంది
నీవు దాన్ని
‘అపనమ్మకం‘
పునాదులపై నిలిపితే
అందుకే అది
చెప్పుడు మాటల ప్రవాహంలో
కొట్టుకు పోతుంది
నింపాదిగా చూడు
ఆశిధిలాల క్రింద
నమ్మకం నలిగిపోతుంది
నీమనసులో అస్థిరత్వం
మాటలలో ఆక్రోశం
చేతలలో అపరిపక్వత...
అనాలోచిత చర్యల దారం
చిక్కుబడిపోయింది
అలోచనల గాలిపటం
ఆధారం లేకుండా ఎగురుతుంది
జాగ్రత్తగా పట్టుకో
దాని కొనన
కొన్ని జీవితాలున్నాయ్....