నైరాశ్యం
నేస్తమా….
చేతిలో చెయ్యేసిన
స్పర్శ స్ఫురణకొస్తుంది
మనసు పై ఒట్టేసిన మాట
గుర్తు చేస్తుంది
నా ప్రాణం నీవేనంటే
నిజమనుకోమా..
నేడు నీవు కల్పించిన స్థితి
నరకానికి నకలనుకోనా
ఈటెలాంటి మాటలతో
హత్యచేయబడి
మౌన సమాధిలోవున్నా…
నాది ….
నిశీది సమయంలో నిశ్శబ్దగానం
నైరాశ్య వీణాతంత్రిపై
వైరాగ్య రాగం ….
నీ జీవన రాగంలో అపశృతిని
వృధాగా రాలిన అశృవుని
అసత్యమాడని అపరాధిని
నిందలు మోసిన నిరపరాధిని
మనసుతో తూచి
మరచిపో నేస్తమా
నేనూ మర్చిపోతున్నా
రోజుకు ఇరవై నాలుగు సార్లు..