మరులుగొలిపే చిత్రాల మార్పిడి మాటల వేగం పెంచింది. ఊసుల ఊహల ప్రయాణం ఊటీ దాకా వెళ్ళింది...
క్షణంవీడి వుండలేనంటూ నిమిషానికో పలకరింపు ఇక భవిష్యత్ అంతా మాదేనంటూ మనసంతా పులకరింపు.
చిరు అవసరం అంటూ చిన్న పరీక్ష పెడితే మేమిద్దరం వేరు కాదు నాకున్నదంతా తనదే అనుకొంది తననెక్కడ కోల్పోతానో అని తల్లడిల్లుతూ తరలివెళ్లింది.
నాణేనికి మరో వైపు ........
తోడుకోసం పడే తొందరలో తోడబుట్టిన వారిని మర్చిపోయింది కొత్త జీవిత ఆశలపరుగులో కన్న తల్లిదండ్రులను ఓడించింది. కనీ పెంచిన బిడ్డ , కట్టుకొన్న భర్త కొత్త కూడికల్లో తీసివేతగా మిగిలారు.
తన అసంతృప్తే వారి ఆయుధం, తన బలహీనతే వారి బలం నైతికతను నిలువునా పాతరేసి అనైతిక బంధానికి బాటలు వేశారు
తియ్యటి మాటల ఊటల్లో ఇచ్చిన మాటలు మునిగిపోయాయి పదునాలుగేళ్ళ అనుబంధపు ఆనకట్ట కొద్ది గంటల ప్రేమపరవళ్ళకు కొట్టుకుపోయింది
గత జీవితపు గతుకుల బాటలు దాటి బండి స్తిరత్వపు రోడ్డుమీదకొచ్చింది. పాతబంధంలో లోపాలున్నాయట మనసు కొత్తదనం కోరుకుంటున్నది. అందుకే...... తను ఎప్పటికీ నిత్య " నవ వధువే "